కామారెడ్డి, ఆగష్టు 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ సమైక్యత పెంపొందించే విధంగా స్వాతంత్ర భారత వేడుకలు ఆగస్టు 8 నుంచి 22 వరకు వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఆదివారం సమావేశం నిర్వహించారు.
భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పండగ వాతావరణం లో వేడుకలు నిర్వహించాలని సూచించారు. ఆగస్టు 8న ప్రారంభోత్సవ వేడుకలు కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహిస్తామన్నారు. ఆగస్టు 9న ఇంటింటికి జాతీయ పతకాల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. 10న వనమహోత్సవం నిర్వహించాలన్నారు.
11న ఫ్రీడం రన్, 12న జాతీయ సమైక్యత దేశభక్తిని పెంపొందించే విధంగా ప్రతి సిటి కేబుల్ ఛానల్ లో టెలికాస్ట్ చేయాలని కోరారు. రక్షాబంధన్, 13న ర్యాలీ, బెలూన్స్ విడుదల ఉంటుందన్నారు. 14న జానపద కళాకారుల ప్రదర్శన, 15న స్వాతంత్య్ర వేడుకలు పండగ వాతావరణంలో జరపాలని సూచించారు. 16న సామూహిక జాతీయ గీతాలాపన, సాయంత్రం కవి సమ్మేళనం ఉంటుందన్నారు. 17న రక్తదాన శిబిరం, 18న ఫ్రీడమ్ కప్,19న పండ్లు ,స్వీట్ల పంపిణీ, 20న ముగ్గుల పోటీలు, 21న జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామాల్లో సమావేశాలు ఉంటాయన్నారు.22న ముగింపు వేడుకలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.