కామారెడ్డి, ఆగష్టు 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చేనేత వస్త్రాలను విరివిగా కొనుగోలు చేసి, వాడుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఆదివారం జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని చేనేత నడక కార్యక్రమాన్ని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
చేనేత కళలను ప్రోత్సహించాలని సూచించారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. చేనేత వస్త్రంల వాడకం గురించి ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంస పత్రాలు అందజేశారు. ర్యాలీ మున్సిపల్ కార్యాలయం నుంచి నిజాంసాగర్ చౌరస్తా మీదిగా రోటరీ క్లబ్ వరకు నిర్వహించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఇందు ప్రియా, డిఆర్‌డిఓ సాయన్న, అదనపు డిఆర్డిఓ మురళీకృష్ణ, ఆర్కే విద్యా సంస్థల డైరెక్టర్ జైపాల్ రెడ్డి, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.