నిజామాబాద్, ఆగష్టు 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఐ.ఎఫ్.టి.యు జిల్లా జనరల్ కౌన్సిల్ విజయవంతమైంది. ఈ సందర్భంగా కౌన్సిల్లో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
జిల్లా అధ్యక్షులు ఎం. ముత్తెన్న, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎం.సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులుగా ఎం.వెంకన్న, డి. రాజేశ్వర్ సహాయ కార్యదర్శులుగా బి.మల్లేష్, ఆర్.రమేష్, కోశాధికారిగా కే.రవితో పాటు 16 మంది జిల్లా కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా జనరల్ కౌన్సిల్ పలు తీర్మానాలు చేసింది. వీఆర్‌ఏల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, కాంటాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, అన్ని ప్రభుత్వ శాఖల్లో కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలి. బస్సు చార్జీలు, విద్యుత్ చార్జీలు తగ్గించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, లేదా అమ్మి వేయడం లాంటి చర్యలను ఆపివేయాలన్నారు.