నిజామాబాద్, ఆగష్టు 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామన్ వెల్త్ గేమ్స్‌లో ఉమెన్స్ బాక్సింగ్ 50 కేజీల విభాగంలో నిజామాబాద్ బిడ్డ నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మొన్నటికి మొన్న ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన నిఖత్, నేడు ఎంతో ప్రతిష్టాత్మకమైన కామన్ వెల్త్ గేమ్స్‌లో ఐర్లాండ్‌కు చెందిన పగిలిస్ట్‌ను ఫైనల్లో ఓడిరచి బంగారు పతకం సొంతం చేసుకోవడం తెలంగాణతో పాటు యావత్ దేశానికే గర్వకారణం అన్నారు. ఈ సందర్బంగా నిఖత్ జరీన్ కు శుభాకాంక్షలు తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలో ఇటీవల నిఖత్ జరీన్‌కు ఘన స్వాగతంతో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి మంత్రి వేముల వ్యక్తి గతంగా నగదు ప్రోత్సాహకం అందించి మరిన్ని పతకాలు సాధించి తెలంగాణ, నిజామాబాద్ పేరు విశ్వవ్యాప్తం చేయాలని ఆకాంక్షించారు.