వలకు చిక్కిన కొండ చిలువ

ఎడపల్లి, ఆగష్టు 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలం పోచారం గ్రామంలోని చెరువులో భారీ కొండ చిలువ వలకు చిక్కగా స్థానికులు పట్టుకొని ఫారెస్టు అధికారులకు అప్పగించారు. అడవుల్లో సంచరించాల్సిన కొండ చిలువ చేపల కోసం వేసిన వలకు చిక్కడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

స్థానికుల వివరాల ప్రకారం… ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పోచారం శివారులోని చెరువులో చేపలు క్రింది ప్రాంతం వెళ్లకుండా అలుగు వద్ద వల వేసి ఉంచగా, వలకు భారీ కొండ చిలువ చిక్కుకుంది. అది గమనించిన మత్స్యకారులు భయాందోళనకు గురయ్యారు. ఏడు ఫీట్ల పొడవుతో, భారీ కాయంతో ఉన్న కొండ చిలువను చూడడానికి స్థానికులు తరలివచ్చారు. అనంతరం కొండ చిలువను ఫారెస్టు అధికారులకు అప్పగించారు.

Check Also

ఆత్మస్థైర్యంతో ఏదైనా సాధించవచ్చు…

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »