కామారెడ్డి, ఆగష్టు 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం బస్తి దవాఖానాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఎస్సీ వాడలో మంగళవారం బస్తీ దవాఖానాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
రాష్ట్రంలో జిల్లాస్థాయిలో మొదటి బస్తి దవాఖానాను కామారెడ్డిలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో వార్డులోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ శోభ, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ హిందూ ప్రియ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ రావు, ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.