నిజామాబాద్, ఆగష్టు 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అఖండ భారత్ గొప్పతనం అందరికీ తెలియజేస్తూ, దేశ స్వాతంత్య్రం నాటి పరిస్థితులను గుర్తుచేసుకోవడం కోసం ఇందూరు ప్రజ్ఞావంతుల వేదిక ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసినట్టు కార్యక్రమ కన్వీనర్ ధారా చంద్రశేఖర్ తెలిపారు.
13వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు స్థానిక వినాయక్‌నగర్‌లోని బస్వాగార్డెన్‌లో సమావేశం ఉంటుందన్నారు. ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త పిఆర్. సోమానీ విచ్చేస్తారని, అలాగే సామాజిక సమరసతా వేదిక తెలంగాణ కన్వీనర్ అప్పాల ప్రసాద్ ప్రధాన వక్తగా ఉపన్యాసం ఉంటుందన్నారు.
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల శుభ సందర్భంలో దేశ ప్రజలందరు సంబరాలు జరుపుకుంటున్న వేళ మనం కూడా భాగస్వాములం కావాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చంద్రశేఖర్ అన్నారు.