Daily Archives: August 10, 2022

16 వరకు పరీక్షల ఫీజు గడువు

డిచ్‌పల్లి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఐ.ఎం.బి.ఎ. ఎనిమిదవ, పదవ సెమిస్టర్స్‌ (థియరీ అండ్‌ ప్రాక్టికల్‌) రెగ్యూలర్‌ / బ్యాక్‌ లాగ్‌ పరీక్ష ఫీజు గడువు ఈ నెల (ఆగస్ట్‌) 16 వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఆంతేగాక ఆలస్య అపరాధ రుసుము 100 రూపాయలతో ఈ నెల (ఆగస్ట్‌) 18 వ తేదీ …

Read More »

25 నుంచి పీజీ ఎగ్జామ్స్‌

డిచ్‌పల్లి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్‌.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.సి.ఎ., ఎం.బి.ఎ., ఎల్‌.ఎల్‌.ఎం., ఎల్‌.ఎల్‌.బి., 5 సంవత్సరాల ఇంటిగ్రేటేడ్‌ (ఎ.పి.ఇ., ఐ.పి.సి.హెచ్‌., ఐ.ఎం.బి.ఎ.) పీజీ కోర్సులకు చెందిన రెండవ, నాల్గవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ / బ్యాక్‌ లాగ్‌ పరీక్షలు మరియు ఐ.ఎం.బి.ఎ. ఎనిమిదవ, పదవ సెమిస్టర్స్‌ థియరీ పరీక్షలు ఈ నెల (ఆగస్ట్‌) 25 …

Read More »

విద్యార్థులతో కలిసి గాంధీ సినిమా వీక్షించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థుల్లో జాతీయత భావం పెంపొందించేందుకు, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను తెలియజేస్తూ స్ఫూర్తి నింపేందుకు వీలుగా ఆయా థియేటర్లలో బుధవారం దేశభక్తి చిత్రమైన ‘గాంధీ’ మూవీని ప్రదర్శించారు. ఈ నేపధ్యంలో కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి బుధవారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఉషా మల్టిప్లెక్స్‌ను సందర్శించారు. గాంధీ సినిమాను తిలకించేందుకు వచ్చిన విద్యార్థులకు ఏర్పాటు చేసిన …

Read More »

పోలీసు శిక్షణ కేంద్రంలో వనమహోత్సవం

ఎడపల్లి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో బుధవారం ఎడపల్లి మండలం జానకంపేట్‌ పోలీస్‌ శిక్షణ కేంద్రం (సి.టి.సి.)లో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా జడ్జి కె.సునీత, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవగా, పోలీస్‌ కమిషనర్‌ నాగరాజు, ఇతర అధికారులు, ఎన్‌సిసి క్యాడెట్లు, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు తదితరులు పాల్గొన్నారు. ఫ్రీడం పార్కుగా …

Read More »

17న రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 17న జిల్లాలో రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం జిల్లా రెడ్క్రాస్‌ సొసైటీ కార్యవర్గ సమావేశం జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. అంగన్వాడి కేంద్రాలలో చిన్నారులకు, గర్భిణీలకు పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. మండల …

Read More »

22న వేలం పాట

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 22న ధరణి టౌన్షిప్‌లో ఉన్న ప్లాట్లు, వివిధ దశలో ఉన్న నిర్మాణాలు, పూర్తయిన ఇండ్లకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం ధరణి టౌన్షిప్‌ ఓపెన్‌ ప్లాట్ల, ఇండ్లపై ఫ్రీ బిడ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ఈసారి వేలంలో 20 ప్లాట్లు, వివిధ దశల్లో …

Read More »

జాతీయ స్ఫూర్తిని చాటేలా ఫ్రీడం రన్‌

నిజామాబాద్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంతో పాటు అన్ని మున్సిపల్‌, మండల కేంద్రాల్లో జాతీయ స్ఫూర్తిని చాటేలా ఫ్రీడం రన్‌ నిర్వహించడం జరుగుతుందని అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ తెలిపారు. ఫ్రీడం రన్‌ ఏర్పాట్ల విషయమై బుధవారం కలెక్టరేట్‌ లోని ప్రగతి భవన్‌లో ఆయా శాఖల అధికారులతో అదనపు కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 11న …

Read More »

16న వజ్రోత్సవ కవి సమ్మేళనం

నిజామాబాద్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 75 సంవత్సరాల భారత స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా నిజామాబాద్‌ జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు – 2022 సంబురాలలో భాగంగా ఈ నెల (ఆగస్ట్‌) 16 వ తేదీన సాయంత్రం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌లో కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ బి. చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నిజామాబాద్‌ జిల్లా …

Read More »

గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కేలా వజ్రోత్సవ వేడుకలు

వేల్పూర్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని వనమహోత్సవంలో భాగంగా రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి బుధవారం వేల్పూర్‌ మండలం పడగల్‌ గ్రామంలోని ఫ్రీడమ్‌ పార్క్‌లో మొక్కలు నాటారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులతో కలిసి ‘‘ఫ్రీడమ్‌ పార్క్‌’’ లో ఏక కాలంలో 750 మొక్కలు …

Read More »

మొక్కలు సంరక్షిస్తే భావితరాలకు ప్రాణవాయువు

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొక్కలను సంరక్షిస్తే భావితరాలకు ప్రాణవాయువు పుష్కలంగా లభిస్తుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని 15 వార్డులో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఫ్రీడమ్‌ పార్క్‌ ఏర్పాటు చేశారు. పార్కులో బుధవారం అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. కాలనీవాసులు పార్కులో నాటిన మొక్కలను ప్రతి కుటుంబం రెండు చొప్పున దత్తత …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »