డిచ్‌పల్లి, ఆగష్టు 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎసెన్షియా బయో పార్మా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన కంపెనీలో ఉద్యోగాల కోసం గురువారం ఉదయం క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ జరిగిన రాత పరీక్షలో 34 మంది ఎమ్మెస్సీ నాల్గవ సెమిస్టర్ విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. ఈ నెల 16 వ తేదీన సెలెక్ట్ అయిన విద్యార్థులకు హైదరాబాద్‌లో ఇంటర్వ్యూ నిర్వహించి 1:2 నిష్పత్తి ప్రకారం ఉద్యోగం లభిస్తుంది.
ఈ డ్రైవ్ సమాపనోత్సవానికి విచ్చేసిన ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ మాట్లాడుతూ ఎసెన్షియా బయోఫార్మా కంపెనీ నిర్వహించ్జిన జాబ్ మేళాలో ఎంపికైన విద్యార్థులందరికి శుభాకాంక్షలు తెలిపారు. టీయూలో కెమిస్ట్రీ విభాగంలో చదివినా, చదువుతున్న విద్యార్థులందరు దాదాపు వంద శాతం ఉద్యోగాలు సాధించారన్నారు. ఇటీవలే ఎటిరో డ్రగ్స్ కంపెనీ ఆధ్వర్యంలో కూడా టీయూలో జాబ్ మేళా నిర్వహించగా 64 మంది ఉద్యోగాలు పొందిన విషయాన్ని గుర్తుచేశారు.
2008 లో ప్రారంభమైన ఎసెన్షియా కంపెనీకి చెందిన ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లో ఉందని, దీని బ్రాంచ్ లు వైజాక్, స్విర్జర్లాండ్, అమెరికాలలో ఉన్నాయని అన్నారు. బయాలాజికల్ యాక్టివిటీస్ కాంపౌండ్స్ రూపొందించిందని అన్నారు. కంపెనీలో ఉద్యోగుల సంక్షేమం కోసం హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, ట్రావెల్లింగ్, కాంటీన్ ఫెసిలిటీ ఉందని అన్నారు. అదే విధంగా ఉన్నత చదువుల కోసం పిహెచ్.డి., పిడిఎఫ్ పరిశోధనా నిమిత్తం అవకాశం కంపెనీ ఇస్తుందన్నారు.
2 సంవత్సరాల అగ్రిమెంట్ బాండ్ తీసుకున్నా గాని వివాహానంతరంగాని, సిఎస్‌ఐఆర్ / జెఆర్‌ఎఫ్ సాధించి కెరీర్ డెవెలప్ మెంట్ కోసం గాని వెళ్లడానికి కూడా అనుమతి ఇస్తుందని అన్నారు. ఇలాంటి వెసలుబాటు ఇతర కంపెనీలో చాలా తక్కువగా ఉంటుందని అన్నారు. ఉద్యోగాల ఇష్టానుసారంగా కంపెనీ నిబంధనలను సడలించినట్లు పేర్కొన్నారు. సంవత్సర ఆదాయం 2.4 లక్షలని తెలిపారు. తదంతర కాలంలో చాలా పెంచుతారని అన్నారు. కావున విద్యార్థుల పురోభివృద్ధిని ఆశించి ఇలాంటి డ్రైవ్‌లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
క్యాంపస్ డ్రైవ్‌లో కెమిస్ట్రీ విభాగాధిపతి డా. బాలకిషన్, బిఒఎస్ డా. సాయిలు, అసోసియేట్ ప్రొఫెసర్ డా. నాగరాజ్ తదితర కెమిస్ట్రీ అధ్యాపకులు, ఎసెన్షియా కంపెనీ సైంటిస్తులు శ్రీనివాస్ రెడ్డి, మహిపాల్ రెడ్డి తదితర సిబ్బంది పాల్గొన్నారు.