హైదరాబాద్, ఆగష్టు 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వీఆర్‌ఏ రాష్ట్ర జేఏసీ సమావేశం చైర్మన్ ఎం రాజయ్య అధ్యక్షతన ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 23 వేల మంది వీఆర్‌ఏలు 20 రోజుల పైగా సమ్మెలో ఉన్నారని, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా సమ్మె కొనసాగుతుందని, గత రెండు మూడు రోజులుగా కొన్ని దినపత్రికలలో వీఆర్‌ఏల గురించి వేరువేరు కథనాలు వస్తున్నాయని సమావేశంలో పాల్గొన్న పమ్రుఖులు అన్నారు.
ఈ కథనాలను వీఆర్‌ఏలు నమ్మవద్దని, రాష్ట్ర ప్రభుత్వం వీఆర్‌ఏ రాష్ట్ర జేఏసీ నాయకులతో చర్చలకు పిలిచి ప్రభుత్వం వెంటనే ఇచ్చినటువంటి హామీలు అమలు అయ్యేంతవరకు సమ్మె కొనసాగుతుందని, భవిష్యత్తు కార్యాచరణ ఆగస్టు 15న, 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా సమ్మె శిబిరాల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించాలన్నారు.
ఆగస్టు 16న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించాలని, ఆగస్టు 17న ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన ధర్నా చేయాలన్నారు. ఆగస్టు 18న పే స్కేల్ జాతరను ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో, ఆగస్టు 19న ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, ఆగస్టు 20న ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్వహించాలని జేఏసీ నిర్ణయించిందన్నారు.
ఆగస్టు 22న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఉద్యోగ ఉపాధ్యాయ, సామాజిక సంఘాలు కార్మిక సంఘాలతో మానవహారాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆగస్టు 25, 26 నుండి రెండు రోజులు (48 గంటల) పాటు కలెక్టరేట్ల వద్ద మహా ధర్నా వంటావార్పు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాలన్నీ వీఆర్‌ఏలు పాల్గొని జయప్రదం చేయాలని వీఆర్‌ఏ జేఏసి రాష్ట్ర కమిటీ వీఆర్‌ఏ లందరికీ తెలియజేస్తుందన్నారు.
ప్రభుత్వం విఆర్‌ఏలకు ఇచ్చిన హామీ ప్రకారం పేస్కేల్ జీవో వచ్చేవరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. సమావేశంలో వీఆర్‌ఏ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఎం రాజయ్య, సెక్రటరీ జనరల్ ఎస్ కే దాదేమియా, కన్వీనర్ డి సాయన్న, కో కన్వీనర్లు వెంకటేశ్ యాదవ్, ఎస్ కే రఫీ, వంగూరు రాములు, జి గోవిందు, నరసింహ రావు, శిరీష రెడ్డి, సునీత తదితరులు పాల్గొన్నారు.