కామారెడ్డి, ఆగష్టు 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతిభకు పేదరికం అడ్డురాదని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కెనరా బ్యాంకులో ఎస్సీ, ఎస్టీ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేసే కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఇష్టపడి చదివితే విజయం సాధించడం సులభం అవుతుందని తెలిపారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని చెప్పారు. విద్యార్థులను ప్రోత్సహించడానికి కెనరా బ్యాంక్ ఉద్యోగులు ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు.
విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు. కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్ చిందం రమేష్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఇందుప్రియా, బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో స్వాతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని విభజన బయానక దినోత్సవ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. దేశ విభజన సమయంలో అసువులు బాసిన అనేకమంది క్షత గాత్రుల చిత్రాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ చిత్రాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించారు.