నిజామాబాద్, ఆగష్టు 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలలో పని చేసి రిటైర్ అయిన ఈపీఎస్ పెన్షనర్లకు కేంద్రం కోర్టు తీర్పును అమలు చేయకుండా ద్రోహం చేసిందని, దీనిని ఐక్యంగా పోరాడాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. ఆదివారం మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవన్‌లో ఈపీఎస్ పెన్షనర్ల సదస్సు జరిగింది.
దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రూ. 9000 వేల రూపాయలు డిఏలు కలిపి ఇవ్వాలని, హెల్త్ స్కీమును అమలు చేయాలని దీనికి దేశంలో ఉన్న 60లక్షల మంది ఈపీఎస్ పెన్షనర్లు ప్రభుత్వంతో పోరాడుతున్నారని, సమస్యలు పరిష్కరించక పోయినట్లయితే తగిన గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు.
సమావేశంలో మరొక అతిథి కే .రాధాకృష్ణ మాట్లాడుతూ లక్షల కోట్ల సంపాదన ఈపీఎస్ పెన్షనర్లు సృష్టించారని ఇప్పుడు వారి పరిస్థితి దీనాతి దీనంగా తయారయిందని కేవలం రూ.1200 నుంచి రూ. 2000 రూపాయల వరకు పెన్షన్ తీసుకుంటూ వృద్ధాప్యంలో జీవితాన్ని ఏ విధంగా నడపాలో ఆలోచించాలని ఆయన తెలిపారు.
దత్తద్రి రావు అధ్యక్షత వహించిన సమావేశంలో ఈపీఎఫ్ పెన్షన్ అనేక మంది హాజరయ్యారు. సమావేశంలో ఈపిఎస్ నాయకులు ఉషాన్, దుర్గాప్రసాద్, రాములు, లక్ష్మణ్, వీరన్న, ఈవిఎల్ నారాయణ, రామ్మోహన్ రావు, సాయిలు, ముత్తారం తదితరులు మాట్లాడారు.