కామారెడ్డి, ఆగష్టు 14
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా కామారెడ్డి జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల టపాకాయలను పేల్చారు. ఆకాశంలోకి రంగురంగుల టపాకాయలను పంపి పేల్చడం చూపరులను ఆకట్టుకుంది. ఆకాశంలో రంగురంగుల మిరమిట్ల కాంతి శోభయమానంగా కనిపించింది.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఆర్డీవో శీను, డి.ఎస్.పి సోమనాథం, జిల్లా అగ్నిమాపక అధికారి మహమ్మద్ అలీ, జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణయ్య, మెప్మా పిడి శ్రీధర్ రెడ్డి, ఆర్కే కళాశాల డైరెక్టర్ జైపాల్ రెడ్డి, అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ కళాబృందం ప్రతినిధులు జాతీయ సమైక్యత, దేశభక్తికి సంబంధించిన గీతాలను వినిపించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.