కామారెడ్డి, ఆగష్టు 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సోమవారం కరోనా సమయంలో రక్తదానంలో చేస్తున్న సేవలను గుర్తించి ఉత్తమ సామాజిక సేవ పురస్కారాన్ని తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా బాలుకు అందజేసి అభినందించారు.
వ్యక్తిగతంగా 66 సార్లు రక్తదానం చేయడం కాకుండా కామారెడ్డి రక్తదాతల సమూహం ద్వారా 10వేల యూనిట్ల రక్తాన్ని, కరోనా సమయంలో 100 యూనిట్ల ప్లాస్మాను అందజేయడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.