కామారెడ్డి, ఆగష్టు 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్ రోడ్డులో గల ఐవీఎఫ్ కార్యాలయంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్టు ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షుడు విశ్వనాధుల మహేష్ గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐవిఎఫ్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఉప్పల ట్రస్ట్ ద్వారా పేద వైశ్యులు, అన్ని కులస్తులకు ఉచితంగా పుస్తెలు మట్టెలు వధువుకు బట్టలు పంపిణీ చేస్తానని, పేద ఆర్యవైశ్యులు డిగ్రీ పీజీ చదువుకునే వారు ఉచితంగా హాస్టల్ వసతి కల్పిస్తానని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడికి విశ్వనాధుల మహేష్ గుప్తా ధన్యవాదాలు తెలిపారు.
భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలను కామారెడ్డి జిల్లా ప్రజలందరూ ఘనంగా నిర్వహించుకోవాలని భారత స్వతంత్ర ఉద్యమ చరిత్రను నేటి యువతరం తెలుసుకొని ఈ దేశం కోసం అసువులు బాసిన అమరుల త్యాగాలను తెలుసుకొని వారి ఆశయ సాధనకు పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐపిఎఫ్ కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గోవింద్ భాస్కర్ గుప్తా, కోశాధికారి వలిబిశెట్టి లక్ష్యం రాజ్యం గుప్తా, కామారెడ్డి జిల్లా తాజా మాజీ అధ్యక్షులు యాద నాగేశ్వరరావు, కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ గుప్తా, కామారెడ్డి యువజన అధ్యక్షుడు వలిబిశెట్టి భాస్కర్ గుప్తా, శని శెట్టి శ్రీనివాసు గుప్త, కూర శ్రీనివాస్ గుప్తా, బొడ్ల వేణు గుప్తా, పాత సత్యం గుప్తా, కామారెడ్డి పట్టణ గల్లి ఆర్య వైశ్య అధ్యక్షులు, కార్యదర్శిలు, కోశాధికారులు పాల్గొన్నారు.