కామారెడ్డి, ఆగష్టు 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ఈరోజు 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తాడువాయి మండలం సంగోజువాడిలో ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్న జమీల్ అహ్మద్‌కు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై అందజేసిన ప్రశంస పత్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అందజేశారు.
కామారెడ్డి రక్తదాతల సమూహ క్రియాసభ్యంగా వ్యవహరిస్తూ ఒకవైపు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉంటూనే 24 సార్లు రక్తదానం చేయడమే కాకుండా మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం నిర్వహించినందుకు ప్రశంసా పత్రాన్ని అందుకోవడం జరిగింది.