నిజామాబాద్, ఆగష్టు 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆజాదీ కా అమృత మహోత్సవాల్లో భాగంగా 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా న్యాయవాది పరిషత్ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని సరస్వతీ నగర్లో గల కార్యాలయం వద్ద పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ జాతీయ పతాకావిష్కరణ చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు.
అనంతరం మాట్లాడుతూ ఆంగ్లేయుల 200 సంవత్సరాల బానిస పాలన నుండి విముక్తి కోసం లక్షలాది మంది ప్రజలు తమ ప్రాణాలు తృణ పాయ్రంగా అర్పించడంతో స్వతంత్రం సిద్ధించిందని వారి త్యాగాల స్ఫూర్తితో నేటి విద్యార్థి యువత దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను దేశభక్తితో ముందుకు సాగి అభివృద్ధి పథంలో నడపాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో న్యాయవాది పరిషత్ నాయకులు రాజకుమార్ సుబేదార్, పడిగల వెంకటేశ్వర్, ఉదయ్ కృష్ణ, న్యాయవాదులు ఆర్ఎస్ఎల్ గౌడ్, వెంకటేశ్వర్, నారాయణ దాస్, బాలరాజ్ నాయక్, బంటు వసంత్, బిక్షపతి, పిండం రాజు, ప్రభాకర్ రెడ్డి, వేణు తదితరులు పాల్గొన్నారు.