కామారెడ్డి, ఆగష్టు 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయగీతం ఐక్యతను చాటుతోందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని నేతాజీ రోడ్డులో మంగళవారం జరిగిన జాతీయ గీతాలాపన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. కామారెడ్డి పట్టణంలో 14 జంక్షన్‌లలో సామూహిక జాతీయ గీతాలపన కార్యక్రమం విజయవంతమైదని చెప్పారు.
వ్యాపారులు, రైతులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు సహకారం అందించారని పేర్కొన్నారు. ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా వజ్రోత్సవాల నిర్వహణలో ముందంజలో ఉండాలన్నారు. స్వాతంత్రం కోసం గాంధీజీ, నెహ్రు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి వారు ఎన్నో త్యాగాలు చేయడం వల్లే స్వతంత్ర ఫలాలను పొందామని చెప్పారు.
ఈ సందర్భంగా నేతాజీ విగ్రహానికి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పూలమాలలు వేశారు. జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, వైస్ చైర్ పర్సన్ ఇందూ ప్రియ, జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షుడు రాజేశ్వరరావు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.