కామారెడ్డి, ఆగష్టు 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మిల్లింగ్ ప్రారంభించని రైస్ మిల్ యజమానులపై చర్యలు తీసుకుంటామని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కలెక్టరేట్ లోని తన చాంబర్లు బుధవారం రైస్ మిల్లుల యజమానులు, డిప్యూటీ తహసిల్దార్లతో మిల్లింగ్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు.
కస్టమ్స్ మిల్లింగ్ రైస్‌ఎఫ్సిఐకి త్వరగా పంపించి నిర్ణీత గడువులోగా మిల్లింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో సివిల్ సప్లై డిఎం జితేంద్ర ప్రసాద్, డిప్యూటీ తహసిల్దార్లు, రైస్ మిల్లుల యజమానులు పాల్గొన్నారు.