కామారెడ్డి, ఆగష్టు 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో భారత స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు జితేశ్ వి పాటిల్ మాట్లాడుతూ ఈ దేశం నాకేమిచ్చిందని కాకుండా ఈ దేశానికి నేనేమి ఇవ్వాలనే భావన నేటి సమాజంలో ఉండాలని, రక్తదానం చేయడం వల్ల చేసిన వ్యక్తులు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఇతరుల ప్రాణాలను కాపాడడం జరుగుతుందన్నారు.
75 వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 75 యూనిట్ల రక్తం దానం చేసిన రక్తదాతలను అభినందించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ రాజన్న, వైస్ చైర్మన్ నాగరాజు గౌడ్, జెఆర్సి అండ్ వైఆర్సి జిల్లా సమన్వయకర్త బాలు, సెక్రెటరీ రఘుకుమార్, డివిజన్ చైర్మన్ రమేష్ రెడ్డి, సెక్రటరీ జమీల్ సలహాదారులు పీ.వీ నరసింహం కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు సిబ్బంది, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్ అధ్యాపకుల బృందం, బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్లు పాల్గొన్నారు.