ఉర్దూలో మీర్‌ అబేద్‌ అలీకి డాక్టరేట్‌

డిచ్‌పల్లి, ఆగష్టు 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉర్దూ విభాగంలో పరిశోధక విద్యార్థి మీర్‌ అబేద్‌ అలీకి పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన ఓపెన్‌ వైవా – వోస్‌ (మౌఖిక పరీక్ష) ను బుధవారం ఉదయం ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలోని మిని సెమినార్‌ హాల్‌లో నిర్వహించారు.

ఉర్దూ పాఠ్యప్రణాళికా సంఘ చైర్మన్‌ అండ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. మూసా ఖురేషి పర్యవేక్షణలో ‘‘అలీ మియాన్‌ నద్వి బాహైసియాత్‌ అదీబ్‌ వా ఇన్షా పర్దాజ్‌’’ అనే అంశంపై పిహెచ్‌. డి. పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథం రూపొందించి సమర్పించారు.

వైవా – వోస్‌కు ఎక్స టర్నల్‌ ఎగ్జామినర్‌ గా హైదరాబాద్‌ నుంచి హైదరాబాద్‌ సెంట్రల్‌ విశ్వవిద్యాలయంలోని ఉర్దూ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ సైయద్‌ ఫజిల్‌ ఉల్లాప్‌ా విచ్చేసి సిద్ధాంత గ్రంథంపై పలు ప్రశ్నలు అడిగి పరిశోధకుడి నుంచి సమాధానాలు రాబట్టి సంతృప్తి వ్యక్తం చేశారు.

వైవా – వోస్‌కు చైర్మన్‌గా ఫ్యాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌ డీన్‌ ప్రొఫెసర్‌ కనకయ్య, కన్వీనర్‌గా ఉర్దూ బిఒఎస్‌ డా. మూసా ఖురేషి, విభాగాధిపతి డా. గుల్‌ – ఇ – రాణా, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా. మహ్మద్‌ అబ్దుల్‌ ఖవి తదితర అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మీర్‌ అబేద్‌ అలీ డాక్టరేట్‌ సాధించడం పట్ల ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ప్రత్యేకంగా శుభాభినందనలు తెలిపారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »