కామారెడ్డి, ఆగష్టు 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ ఫెడరేషన్ నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. కామారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న బార్ అసోసియేషన్ బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో బుధవారం కామారెడ్డి జిల్లా ఫెడరేషన్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
అధ్యక్షులుగా వైద్య అమృత రావు (కామారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు), ఉపాధ్యక్షులు పండరి (ఎల్లారెడ్డి బార్ అసోసియేషన్), ప్రధాన కార్యదర్శిగా భూషణ్ రెడ్డి (బాన్సువాడ బార్ అసోసియేషన్), సహాయ కార్యదర్శి శంకర్ పాటిల్ (బిచ్కుంద బార్ అసోసియేషన్), కోశాధికారిగా జోగుల గంగాధర్ కామారెడ్డి బార్ అసోసియేషన్ మరియు జిల్లాలోని అన్ని బార్ అసోసియేషన్ల కార్యదర్శులు జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా నియమించబడ్డారు.
నూతనంగా ఎన్నుకోబడిన ఫెడరేషన్ అధ్యక్షులు వైద్య అమృత రావు మాట్లాడుతూ న్యాయవాదుల సంరక్షణ చట్టాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, ఈ మధ్యకాలంలో న్యాయవాదులపై హత్యలు దాడులు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల నిరసన కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కు వినతిపత్రాన్ని అందజేయడం, జిల్లాలోని అన్ని కోర్ట్‌ల ముందు నిరసన దీక్ష చేపట్టడం, బాన్సువాడ, ఎల్లారెడ్డి ఆర్డీవోలకు, బిచ్కుంద తహసిల్దార్‌కు వినతి పత్రాన్ని ఇచ్చేందుకు ఫెడరేషన్ తీర్మానించినట్టు చెప్పారు.