ఆర్మూర్, ఆగష్టు 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్ముర్ హౌసింగ్ బోర్డు కాలని గౌడ సంఘంలో సర్ధార్ సర్వయి పాపన్న గౌడ్ జయంతిని ఆర్మూర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూర్ లింగ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం నిజామాబాద్లో ఏర్పాటు చేసిన నూతన విగ్రహం సర్ధార్ సర్వయి పపాన్న గౌడ్ విగ్రహం వద్ద పూల మాలలు వేసి నివాళులు అర్పించినట్టు అబ్బగోని అశోక్ గౌడ్ తెలిపారు.
ఈ సందర్భంగా అశోక్ గౌడ్ మాట్లాడుతూ మూడు వందల ఏళ్ల క్రితమే మొఘల్ సామ్రాజ్యాన్ని భూస్థాపితం చేసి బహుజన వర్గాల కోసం పోరాటం చేసిన ధీరుడు, దోపిడిదారులను అంతమొందించి దొరల పాలనకు చరమగీతం పాడిన మహాత్ముడు పాపన్న గౌడ్ అన్నారు.
ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క వర్గానికో కాకుండా అన్ని కులాలను కలుపుకుపోయి బహుజన రాజ్య స్థాపనకు కృషి చేసిన అధినేత అని, కొన్ని వందల సంవత్సరాల క్రితమే గోల్కొండను ఏలిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ యోధుడికి జోహార్లు తెలిపారు.
ఆయన ఆశయ సాధనే లక్ష్యంగా కొనసాగిస్తమని అబ్బగోని అశోక్ గౌడ్ తెలంగాణ బిసి సంక్షేమ సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రెటరీ ఉట్నూర్ సత్యా గౌడ్, ఆర్మూర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూర్ లింగ గౌడ్, కౌన్సిలర్ వరలక్ష్మి, లింబాద్రి గౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ మోకు దెబ్బ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్గౌడ్, మోకుదెబ్బ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి నరసింహులు గౌడ్, చాయ గోవర్ధన్, ముఖేష్ గౌడ్, నారాయణ గౌడ్, రిటైర్డ్ టీచర్, తదితరులు పాల్గొన్నారు.