కామారెడ్డి, ఆగష్టు 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వృత్తిపరమైన ఒత్తిడిని జయించేందుకు క్రీడలు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా జిల్లా యువజన సర్వీసులు క్రీడల శాఖ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని కోరారు. ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు క్రీడ పోటీలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. కలెక్టరేట్ ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది ఉత్సవంగా క్రీడా పోటీల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు.
జిల్లాస్థాయి క్రికెట్ పోటీలలో విజేతగా పోలీస్ జట్టు నిలిచింది. ద్వితీయ స్థానంలో కలెక్టరేట్ ఉద్యోగులు గెలుపొందారు. టాగ ఫర్లు జిల్లా కలెక్టర్ జట్టు ప్రథమ స్థానం దక్కించుకుంది. ద్వితీయ స్థానం ఎస్పీ జట్టు కైవసం చేసుకుంది. మహిళల విభాగం లో మున్సిపల్ చైర్మన్ జాహ్నవి జట్టు విజయం సాధించారు.
ద్వితీయ స్థానంలో ఆర్టీవో వాణి జట్టు గెలిచింది. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మునిసిపల్ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడ పోటీలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, స్థానిక సంస్థల కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, సిపిఓ రాజారాం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, టీఎన్జీవోఎస్ ప్రధాన కార్యదర్శి సాయిలు, ఉద్యోగులు పాల్గొన్నారు.