బోధన్, ఆగష్టు 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ ప ట్టణంలో ఓ ప్రయివేటు చిట్‌ఫండ్ కంపెనీపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు శుక్రవారం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. చిట్‌ఫండ్ కంపెనీ గత 48 నెలలుగా చిట్టి డబ్బులు లక్ష 92 వేల రూపాయలు కట్టించుకొని తమకు రావాల్సిన డబ్బు ఇవ్వకుండా గత కొన్ని నెలలుగా సతాయిస్తున్నాడంటూ బాధితుడు వాపోయాడు.
వెంటనే చిట్‌ఫండ్ సంస్థపై చర్యలు తీసుకోవాలని తమకు రావాల్సిన చిట్టి డబ్బులు ఇప్పించాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పట్టణ సిఐ ప్రేమ్‌కుమార్ తెలిపారు.