బాలశ్రీనివాస మూర్తికి ధర్మనిధి పురస్కారం

డిచ్‌పల్లి, ఆగష్టు 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖకు చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ప్రముఖ సాహిత్య పరిశోధకులు, విమర్శకులు డా. గుమ్మన్నగారి బాలశ్రీనివాస మూర్తికి 2022 సంవత్సరానికి గాను డా. తిరుమల శ్రీనివాసాచార్య – స్వరాజ్యలక్ష్మి ధర్మనిధి పురస్కారానికి ఎంపికయ్యారు.

ప్రముఖ కవి డా. తిరుమల శ్రీనివాసాచార్య ఏర్పాటు చేసిన ఈ పురస్కారానికి సాహితీ రంగంలో విశేష సేవలు అందిస్తున్నందుకు డా. జి. బాలశ్రీనివాస మూర్తిని ఎంపిక చేశారు. ఈ నెల 21 వ తేదీ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ త్యాగరాయ గానసభలో జరిగే కార్యక్రమంలో పురస్కార ప్రదానం జరుగుతుంది. డా. జి. బాలశ్రీనివాస మూర్తి పురస్కారానికి ఎంపిక కావడం పట్ల ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, ఏప్రిల్‌.5, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »