డిచ్పల్లి, ఆగష్టు 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్‌లో ఇది వరకే పిహెచ్. డి. పరిశోధన కోసం క్యాటగిరి – 2 నోటిఫికేషన్‌ను డీన్ ఆచార్య ఎం. అరుణ విడుదల చేశారు. కాగా తాజాగా శుక్రవారం ఉదయం పిహెచ్.డి. క్యాటగిరి – 2 నోటిఫికేషన్‌కు సంబంధించిన ఫీజు గడువు పొడిగించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్‌ల్లో గల అప్లైడ్ స్టాటిస్టిక్స్, బయోటెక్నాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, జియో ఇన్ ఫార్మాటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్సెస్ సబ్జెక్టుల్లో క్యాటిగిరి – 2 కి చెందిన నెట్, స్లెట్ / సెట్, ఎం.టెక్‌తో పాటుగా గేట్ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి మాత్రమే పిహెచ్. డి. పరిశోధన చేయడానికి దరఖాస్తులు కోరుతున్నామన్నారు.
చివరి తేది ఈ నెల 20 వ తేదీ ఉండగా 27 తేదీ వరకు పొడిగించినట్లు రూ. 1100 ఫీజుతో దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి సైన్స్ డీన్ కార్యాలయంలో సమర్పించాలని ఆమె కోరారు. తదితర పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ సందర్శించాలన్నారు.