కామారెడ్డి, ఆగష్టు 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలసదనంను శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా చిన్నారులకు బహుమతులను ప్రధానం చేశారు. దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో చిన్నారులకు క్రీడ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు.
చిన్నారులకు స్వీట్లు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేశారు. పోలీస్ కళాజాత బృందం వారు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఆస్పత్రిలోని ఆలన పాలియేటివ్ సేవా కేంద్రంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేపట్టారు. కామారెడ్డి పట్టణంలోని ఉపకార గారంను సందర్శించారు. జైల్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఖైదీలకు పండ్లు పంపిణీ చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అధికారులు పాల్గొన్నారు.