డిచ్‌పల్లి, ఆగష్టు 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఉపకులపతి తెలిపారు. ఆట స్థలం మైదాన ప్రాంతంలో నాలుగు రోజుల నుంచి గడ్డిని, పిచ్చి మొక్కలను తీసివేస్తూ చదును చేస్తున్నామని, ట్రాక్టర్లతో బ్లేడిరగ్ వేయిస్తున్నామని ఆయన తెలిపారు.
బాలికల వసతి గృహం ప్రవేశ ద్వారం, ప్రహరీ గోడ పరిసర ప్రాంతంలో గడ్డి, పిచ్చి మొక్కలు తీయించి పరిశుభ్రం చేయడం జరిగిందన్నారు. బాలికల వసతి గృహంలో మరమత్తులు చేస్తూ సిమెంట్ వర్క్ పనులు పూర్తి చేయిస్తున్నామని అన్నారు.
బాలుర వసతి గృహంలో 24 గంటలు ఇంటర్నెట్ వైఫై కోసం సుమారు పనులు పూర్తి అయ్యాయని అన్నారు. బాలికల వసతి గృహంలో కూడా వైఫైకి సంబంధించి కొంత పని పూర్తి అయ్యిందని అన్నారు. విద్యార్థులు అడిగిన పనులు త్వరితగతిన పూర్తి చేస్తూనే ఉన్నామని అన్నారు.