ప్రతి మూడునెలలకోసారి రక్తదానం

కామారెడ్డి, ఆగష్టు 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గీరెడ్డి రవీందర్‌ రెడ్డి వైద్యశాలలో డిచ్‌పల్లి మండలం సిర్నాపల్లి గ్రామానికి చెందిన రాజన్న (70) కు ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో దోమకొండ మండల కేంద్రానికి చెందిన వ్యాపారి మందుల సంతోష్‌కు తెలియజేయగాని వెంటనే స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారని, రెడ్‌ క్రాస్‌ అండ్‌ ఐవిఎఫ్‌ జిల్లా సమన్వయకర్త బాలు తెలిపారు.

ప్రతి 3 నెలలకు ఓకసారి రక్తదానం చేస్తూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న సంతోష్‌ సేవలు అభినందనీయమని, సంవత్సరానికి 4 సార్లు రక్తదానం చేయడం వారికి సమాజం పట్ల ఉన్న సామాజిక బాధ్యతకు అద్దం పడుతుందన్నారు.

రక్తదానానికి ముందుకు వస్తున్న సంతోష్‌కు రెడ్‌ క్రాస్‌ జిల్లా అధ్యక్షులు కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌ సిబ్బంది యేసుగౌడ్‌, చందన్‌ పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »