కామారెడ్డి, ఆగష్టు 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్లోని ప్లాట్లు, వివిధ దశలో ఉన్న గృహాలు, పూర్తయిన గృహాలకు ఈనెల 22 నుంచి 26 వరకు కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వేలంపాట నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఆదివారం ఆయన ధరణి టౌన్షిప్లో ఉన్న ప్లాట్లను, గృహాలను పరిశీలించారు.
వేలంలో పాల్గొనేవారు పదివేల రూపాయలు ఈఎండి చెల్లించాలని సూచించారు. 30 అడుగుల అంతర్గత రహదారులు ఉన్నాయని చెప్పారు. 44వ నెంబర్ జాతీయ రహదారి సమీపంలో ఈ ప్లాట్లు, గృహాలు ఉన్నాయని సూచించారు. ఆసక్తి గలవారు వాటిని పరిశీలించి సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలని పేర్కొన్నారు.
ప్లాట్ల సంఖ్య : 20, పునాదుల దశ పూర్తయిన గృహాలు : 175, వివిధ దశల్లో పూర్తయిన గృహాల సంఖ్య : 130, మొత్తం సంఖ్య 325 ఉన్నాయని ఆయన వివరించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అధికారులు పాల్గొన్నారు.