కామారెడ్డి, ఆగష్టు 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మొక్కలు నాటి భావితరాలకు ప్రశాంతమైన వాతావరణాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ధరణి టౌన్షిప్‌లో ఆదివారం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
మనం నాటిన మొక్కలు భవిష్యత్తు తరాలకు నీడను, పండ్లు, ప్రాణవాయువును అందిస్తాయని సూచించారు. పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.