కామారెడ్డి, ఆగష్టు 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యోగ ద్వారా పరిపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని భవిత పాఠశాలలో ఆదివారం యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఛాంపియన్షిప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్య అతిథిగా మాట్లాడారు.
యోగ చేయడం వల్ల ఆనందం, మానసిక ఉల్లాసం కలుగుతోందని సూచించారు. మాచారెడ్డి కేజీబీవీ విద్యార్థులు యోగ విన్యాసాలు చేశారు. అసాధ్యమైన విన్యాసాలను చిన్నారులు సాధ్యం చేసి చూపించారని కలెక్టర్ కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్ రెడ్డి, ప్రిన్సిపల్ రాజశేఖర్, ప్రతినిధులు గరిపల్లి అంజయ్య, రఘు కుమార్, సంజీవరెడ్డి, అనిల్ రెడ్డి, అంతిరెడ్డి, ఈశ్వర్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.