వైభవంగా సాగిన జగన్నాథ రథయాత్ర

నందిపేట్‌, ఆగష్టు 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో జగన్నాథ రథయాత్ర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ‘జై జగన్నాథ.. జైజై జగన్నాథ’ అంటూ భక్తులు స్వామివారికి స్వాగతం పలికారు. కేదారేశ్వర ఆశ్రమం వద్ద ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల గుండా అంబేద్కర్‌ చౌరస్తా నుండి బస్టాండ్‌ మీదుగా వెళ్లి పుర వీధుల్లో కనువిందు చేసిన యాత్ర నాగమంతెన కళ్యాణమండపం దగ్గర ముగిసింది.

భక్తులతో నందిపేట్‌ గ్రామం కిటకిటలాడిరది, రథాలను లాగడానికి భక్తులు పోటీపడ్డారు. ట్రాఫిక్‌ సమస్య రాకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా ట్రాఫిక్‌ను నూతన బైపాస్‌ రోడ్డు గుండా మళ్లించారు. కార్యక్రమం మంగి రాములు మహారాజు ఆధ్వర్యంలో జరిగింది. స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »