కామారెడ్డి, ఆగష్టు 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 47వ వార్డ్ లో ఎస్డిఎఫ్ 5 లక్షల నిధులతో అభివృద్ది పనులలో భాగంగా కమ్మరి గల్లి, కుంబాల గల్లి, కాకర్ల గల్లిలో సిసి రోడ్ పనులను 47వ వార్డ్ కౌన్సిలర్ గెరిగంటి స్వప్న లక్ష్మీనారాయణ అధ్వర్యంలో ఎంఎల్ఏ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సహకారంతో, ఎంకె ముజీబొద్దీన్, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావు, మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి చోరవతో సిసి రోడ్డు పనులను ప్రారంభించారు.
కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి సభ్యులు నిమ్మ మోహన్ రెడ్డి, 46వ వార్డు కౌన్సిలర్ కోయల్ కార్ కన్నయ్య, కాలనీవాసులు కాకర్ల రవి, బోడ్డు గంగయ్య, కుంబాల రాజు, కుంబాల రమేష్ , అజీం, సోహల్, చెన్నం స్వామి, కమ్మరి క్రాంతి, నాడెం బాలగౌడ్, మేర రాంచందరం, మేర లక్ష్మణ్, కాకర్ల బాలయ్య, నత్తి రమేష్, మేర గణేష్, కమ్మరి శ్రీనివాస్, మేర శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.