ఎల్లారెడ్డి, ఆగష్టు 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో భోజనం వికటించి 40 మంది పిల్లలకు అస్వస్థత కాగా ఆసుపత్రికి తరలించారు. దీన్ని బట్టిచూస్తే హాస్టల్ వార్డెన్ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం ఎలా ఉందో చెప్పకనే చెప్పచ్చు.
గాంధీ సినిమాలో తినుబండారాల వల్ల జరిగిందని వార్డెన్ చెబుతున్నారు. సినిమాకు వెళ్ళిన వారందరు 8,9,10 తరగతుల విద్యార్థులు. ఇక్కడ వికటించింది మాత్రం 5,6,7, ఇంటర్ విద్యార్థులు కూడా ఉన్నారు. అలా చెప్పాలంటే అన్ని పాఠశాలలు విద్యార్థులు సినిమాలు చూస్తున్నారు వారికి ఏమి కాలేదే మరి అని పిల్లల తల్లి దండ్రులు ఆరోపిస్తున్నారు. ఎవరు ఏమి అనుకున్న కానీ వార్డెన్ నిర్లక్ష్యం పిల్లల ప్రాణాల మీదకు వచ్చింది అని పలువురు ఆరోపిస్తున్నారు.