నిజామాబాద్, ఆగష్టు 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అర్జీలు వచ్చాయి. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందాయి.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌తో పాటు డీపీఓ జయసుధకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను వెంటదివెంట పరిశీలన జరుపుతూ, ప్రజావాణి సైట్లో వివరాలను అప్ లోడ్ చేయాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.