నిజామాబాద్, ఆగష్టు 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్నేషనల్ ఫెడరేషన్ అఫ్ రెడ్ క్రాస్ (ఐ.ఎఫ్.ఆర్.సి) నిధులతో, రాష్ట్ర గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ రెడ్ క్రాస్ డా.తమి తమిళి సై సౌందర రాజన్ కృషితో, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ సౌజన్యంతో నిజామాబాదు జిల్లా రెడ్ క్రాస్‌కి అందచేసిన సంచార రక్త సేకరణ వ్యాన్‌ను సోమవారం ఉదయం జిల్లా పాలనాధికారి అండ్ ప్రెసిడెంట్ సి నారాయణ రెడ్డి క్యాంప్ ఆఫీస్ దగ్గర జండా ఊపి ప్రారంభించారు.
వ్యాన్‌లో రక్త సేకరణలో ఉపయోగ పడే ప్రతి వస్తువు, మూడు కోచులు అందుబాటులో ఉన్నాయని, ఇది రక్తదాతలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. దీన్ని అందించిన ఐ.ఎఫ్.ఆర్.సి కి కృతజ్ఞతలు తెలుపుతూ రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు, కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపే రవీందర్, ఈ.సి. మెంబెర్ సూర్యనారాయణ, వెంకట కృష్ణ, నిజామాబాదు డివిజనల్ చైర్మన్ డా.శ్రీశైలం, వైస్ చైర్మన్ మురళి కృష్ణ, ఎం.సి మెంబర్ శ్రీనివాస్ రావు, ఇతరులు పాల్గొన్నారు.