నిజామాబాద్, ఆగష్టు 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ వారు నిర్వహిస్తున్న టెక్ బీ ప్రోగ్రాం కొరకు ఎంపిసి, ఎంఇసి మాథ్స్ సబ్జెక్ట్ తో కనీసం 60 శాతం సగటు మార్కులతో ఉత్తీర్ణత పొందిన ఇంటర్మీడియట్ 2021 ` 22 లో పూర్తి చేసుకున్న విద్యార్థులకు సాఫ్ట్ వేర్ రంగంలో మెగా ఉద్యోగ మేళా ఏర్పాటు చేయించామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 26న శుక్రవారం ఉదయం 9 గంటలకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో మెగా జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నారని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ కళాశాలల్లో 2021 ` 22 విద్యా సంవత్సరంలో ఎంపిసి / ఎంఇసిలో 60శాతం సగటుతో ఉత్తీర్ణులైన ఆసక్తి గల అభ్యర్థులు ఈ ఎంపిక ప్రక్రియకు హాజరు కావచ్చని సూచించారు.
పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత సాధించిన మెమోలు, ఆధార్ కార్డు నకలు, ఒక ఫోటో, ఆండ్రాయిడ్ మొబైల్‌తో ఎంపిక ప్రక్రియకు హాజరు కావాలని కోరారు. పూర్తి వివరాలకు హెచ్.సి.ఎల్. ఏరియా ప్రతినిధి రాజుల రాజేష్ కుమార్, సెల్ నెంబర్ 8074065803 / 9493553821 ను సంప్రదించాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.