డిచ్‌పల్లి, ఆగష్టు 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాయంలోని సంట్రల్ లైబ్రెరీ ఎదురుగా గల ప్రాంగణంలో ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ సోమవారం ఉదయం ‘‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’’ సందర్భంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ… స్వాతంత్య్ర స్ఫూర్తికి, జాతీయతా భావానికి చిహ్నంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. మొక్కలను నాటడం వల్ల మానవ జీవన ఆయుష్షును పెంపొందింపజేయవచ్చని అన్నారు. దీని వల్ల వాతావరణ సమతౌల్యం కలిగి, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ పచ్చని ప్రకృతి శోభతో తులతూగుతుందన్నారు.
పశుపక్ష్యాలకు, జంతువులకు నిలయమని అన్నారు. 75 సంవత్సరాల భారత స్వాతంత్య సంబరాలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య బి. విద్యావర్ధిని తదితర అధ్యాపకులు, అధ్యాపకేతరులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు ఉన్నారు.