కామారెడ్డి జిల్లా కోర్టు సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాస్‌ బదిలీ

కామారెడ్డి, ఆగష్టు 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కోర్టులో సీనియర్‌ సివిల్‌ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌ బుధవారం బదిలీపై హైదరాబాద్‌ కూకట్‌ పల్లి కోర్ట్‌ కి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్బంగా జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు వైద్య అమృతరావు మాట్లాడుతూ గత మూడున్నర సంవత్సరాలుగా కామారెడ్డిలో సీనియర్‌ సివిల్‌ జడ్జిగా విధులు నిర్వహించారని, త్వరితగతిగా కేసులను పరిష్కారానికి ఎంతో కృషిచేసారని కొనియాడారు. గతంలో బోధన్‌ కోర్టులో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా విధులు నిర్వహించి పదోన్నతి మరియు బదిలీపై సీనియర్‌ సివిల్‌ జడ్జిగా కామారెడ్డి జిల్లా కోర్టుకు వచ్చారన్నారు.

సీనియర్‌ సివిల్‌ కోర్ట్‌లో ఉన్నటువంటి కేసులను త్వరితగతిన సమస్య పరిష్కారం అయ్యే విధంగా పూర్తిస్థాయిలో న్యాయం చేయడానికి ఎంతో కృషి చేశారని అన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు వైద్య అమృతరావు ఆధ్వర్యంలో ఘనంగా పుష్పగుచ్చం, శాలువతో సత్కారం, జ్ఞాపిక అందజేశారు.

సమావేశాన్ని ఉద్దేశించి న్యాయవాదులు మాట్లాడుతూ జడ్జి శ్రీనివాస్‌ సివిల్‌ మరియు క్రిమినల్‌ కేసుల విషయంలో న్యాయవాదులకు అందరికీ సమయపాలన సత్వర న్యాయం కలిగించే ఏర్పాటుకై ఎంతో కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలోన్యాయమూర్తులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ శ్రీదేవి, సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాస్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి స్వాతి మురారి, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జ్‌ వెంకటేష్‌ ధ్రువ, బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు శేషు, కోశాధికారి గంగాధర్‌, స్పోర్ట్స్‌ సెక్రటరీ జడల రజినీకాంత్‌, ఈసీ మెంబర్‌లు దేవేందర్‌ గౌడ్‌, షబానా,ఆన్సర్‌ అలీ, శ్రీధర్‌, ఏజిపి నరేందర్‌ రెడ్డి, పిపి దామోదర్‌ రెడ్డి, జగన్నాథం, రామచంద్ర రెడ్డి, నరేష్‌ చంద్‌, రమేష్‌ చంద్‌, బండారి సురేందర్‌ రెడ్డి, మాణిక్యరావు, గోవిందరావు, స్టీఫెన్‌ రాజు, సూర్య ప్రసాద్‌ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »