కామారెడ్డి, ఆగష్టు 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల ఎస్ఆర్కె డిగ్రీ పీజీ కళాశాలలో బుధవారం తెలంగాణ యూనివర్సిటీ నుండి అర్థశాస్త్రంలో డాక్టరేట్ పొందిన టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలును ఆర్కే విద్యాసంస్థల సెక్రటరీ, కరస్పాండెంట్ జైపాల్ రెడ్డి, ఎస్ఆర్కె డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ దత్తాద్రి సన్మానించారు.
ఈ సందర్భంగా కళాశాల సీఈవో జైపాల్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక సేవలో ముందు ఉండడమేకాక అత్యున్నత విద్య అయిన అర్థశాస్త్రంలో డాక్టరేట్ సాధించడం కామారెడ్డి జిల్లాకే గర్వకారణమని నేటి యువతకు, సమాజానికి ఆదర్శంగా నిలిచిన బాలు సేవలు అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను ఆకాంక్షించాలన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం మధుసూదన్ రెడ్డి, తిరుపతిరెడ్డి, సందీప్, బాల్ రెడ్డి, దత్తుకుమార్, బాలకృష్ణ పాల్గొన్నారు.