కామారెడ్డి, ఆగష్టు 24
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రూర్బన్లో ఉద్యానవన శాఖ పనులను తక్షణమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం కామారెడ్డి కలెక్టరేట్లో ఉద్యానవన శాఖ ద్వారా చేపట్టిన పనులపై సమీక్ష నిర్వహించారు.
ఈనెల 30లోగా పనులు పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, డిఆర్డిఓ సాయన్న, జిల్లా ఉద్యానవన అధికారి సంజీవరావు, అధికారులు పాల్గొన్నారు.