నిజామాబాద్, ఆగష్టు 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలలో, ప్రముఖ ప్రైవేట్ కార్మిక కేంద్రాలలో పనిచేసి రిటైర్ అయిన ఈపీఎస్ పెన్షనర్లకు, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం నెలకు రూ. 9000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం నిజాంబాద్‌లోని రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి రీజినల్ ప్రావిడెంట్ ఫండ్ అధికారి హనుమంతప్పకు మెమోరాండం సమర్పించారు.
దేశవ్యాప్తంగా 60 లక్షల మంది, లక్షల కోట్ల దేశ సంపద సృష్టికర్తలైన పెన్షనర్లకు బ్రతకటానికి కావలసిన పెన్షన్ ఇవ్వటం లేదని కేవలం రూ. 500 నుండి రూ. 2000 వరకు ఆశా పెన్షన్ కన్నా తక్కువ ఇస్తున్నారని, దీంతోఎలా బ్రతకాలో ప్రభుత్వం తెలపాలని వారు డిమాండ్ చేశారు.
సుప్రీం కోర్టు తీర్పులను అమలు చేయడం లేదని, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమును అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగాఅసరా పెన్షన్ కూడా ఇవ్వాలని కోరారు. ధర్నా కార్యక్రమంలో ఈపీఎస్ పెన్షనర్ల జిల్లా కన్వీనర్ అద్దంకి ఉషాన్, నాయకులు కే. రామ్మోహన్రావు, దుర్గాప్రసాద్, రాములు, వీరన్న, లక్ష్మణ్, నారాయణ జార్జి, ముత్తరం, తదితరులు పాల్గొన్నారు.