Daily Archives: August 26, 2022

కొత్త పెన్షన్ల పంపిణీ ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆసరా పథకం కింద కొత్తగా దాఖలైన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి సత్వరమే పెన్షన్లు పంపిణీ చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్‌ 3వ తేదీ లోపు పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని గడువు విధించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ ఆయా శాఖల అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష …

Read More »

మొక్కలు భావితరాల మనుగడకు దోహదపడతాయి

కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొక్కలు నాటడం వల్ల అవి వృక్షాలుగా మారి భావితరాల మనుగడకు దోహదపడతాయని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కలెక్టరేట్‌ ఆవరణలో శుక్రవారం ఆయన మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు రెండు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి, అడిషనల్‌ ఎస్పీ అన్యోన్య, అధికారులు పాల్గొన్నారు.

Read More »

మట్టి వినాయకులతో పర్యావరణ పరిరక్షణ

కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మట్టి వినాయకులను ఏర్పాటు చేసుకొని పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం శాంతి కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌, రెవెన్యూ, మున్సిపల్‌, విద్యుత్తు శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఉత్సవాలు శాంతియుతంగా జరగడానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. విద్యుత్తు …

Read More »

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో వ్యక్తికి జైలుశిక్ష

ఎడపల్లి, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మద్యం సేవించి బైకు నడిపిన ఓ వ్యక్తిపై కేసు నమోదు కాగా, శుక్రవారం బోధన్‌ సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ నెలరోజుల జైలుశిక్ష విధించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన గోవూరి హన్మాండ్లు అనే వ్యక్తి మార్చి 21న మంగళ్‌పాడ్‌ చౌరస్తా వద్ద మద్యం సేవించి బైకు నడుపుతుండగా పోలీసుల తనిఖీలో పట్టుబడ్డాడు. ఎడపల్లి పోలీసులు …

Read More »

అసత్యపు ప్రచారాలు మానుకోవాలి..

బీర్కూర్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీజేపీ నాయకులు అసత్యపు ప్రచారాలు మానుకోవాలని లేకుంటే ప్రజలు తగిన బుధ్హి చెప్తారని మండల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు పెరుక శ్రీనివాస్‌, ఎంపీపీ విట్ఠల్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయిన కవితపై బీజేపీ గుండాలు చౌకబారు రాజకీయాలు చేస్తూ ఆమె ఇంటిపై దాడి చేయడం పిరికిపందపు …

Read More »

బండి సంజయ్‌ వెంటనే క్షమాపణ చెప్పాలి

నిజామాబాద్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ సొంత పార్టీ వారు ఎంఎల్‌సి కవితపై నిరాధార నిందలు మోపగానే హైదరాబాద్‌ బిజెపి కార్యకర్తలు ఎంఎల్‌సి ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్య అని, ఈ సంఘటనను బిసి కులాల ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తుందని బిసి కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయాల్లో ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం సహజమే …

Read More »

అదుపుతప్పి లారీ బోల్తా

కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నుంచి లింగంపేట్‌ కు వెళ్లే మార్గమధ్య ముస్తాపూర్‌ గ్రామ శివారులో లారీ బోల్తా పడిరది. కాగా లారీలో ఉన్న డ్రైవర్‌తో పాటు ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. స్వల్ప గాయాలు అయిన వారిని 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. లారీ నెంబర్‌ టిఎస్‌ 15 యు 7888. ప్రమాద వివరాలు తెలియాల్సి ఉంది.

Read More »

చదువుతూనే ఉద్యోగం – గొప్ప అవకాశం

నిజామాబాద్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హెచ్‌.సి.ఎల్‌. టెక్‌ బీ ఎర్లీ కెరీర్‌ ప్రోగ్రాంలో చేరి, చదువుతూనే ఉపాధి అవకాశం పొందడం గొప్పవరం అని జిల్లా ఇంటర్‌ విద్యా అధికారి రఘురాజ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిరాజ్‌ డిగ్రీ కళాశాల ఆవరణలోని ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు హెచ్‌.సి.ఎల్‌. టెక్‌ సంస్థ ఆధ్వర్యంలో 2021-22 విద్యా సంవత్సరం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »