బీర్కూర్, ఆగష్టు 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీజేపీ నాయకులు అసత్యపు ప్రచారాలు మానుకోవాలని లేకుంటే ప్రజలు తగిన బుధ్హి చెప్తారని మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెరుక శ్రీనివాస్, ఎంపీపీ విట్ఠల్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయిన కవితపై బీజేపీ గుండాలు చౌకబారు రాజకీయాలు చేస్తూ ఆమె ఇంటిపై దాడి చేయడం పిరికిపందపు చర్య అని విమర్శించారు. కేవలం సీఎం కేసీఆర్ కుమార్తె అయినందు వల్ల ఆమెను బదనాం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు అల్లరి మూకలను రెచ్చగొట్టి చిల్లర రాజకీయాలు మానుకోవాలని లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఇకపై మీ ఆటలు సాగవని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. సమావేశంలో వైస్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, జిల్లా కో ఆప్షన్ సభ్యుడు మాజిద్, మాజీ ఎంపిటిసి కంది మల్లేశం, బాలకృష్ణ, మైసగౌడ్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.