బండి సంజయ్‌ వెంటనే క్షమాపణ చెప్పాలి

నిజామాబాద్‌, ఆగష్టు 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ సొంత పార్టీ వారు ఎంఎల్‌సి కవితపై నిరాధార నిందలు మోపగానే హైదరాబాద్‌ బిజెపి కార్యకర్తలు ఎంఎల్‌సి ఇంటిపై దాడి చేయడం హేయమైన చర్య అని, ఈ సంఘటనను బిసి కులాల ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తుందని బిసి కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

రాజకీయాల్లో ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం సహజమే కానీ మీరే నిందలు వేసి ఒక ఆడబిడ్డ ఇంటిపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. నిందలు మోపినవారు అదికారులు కాదని, ఎటువంటి విచారణలో ఎంఎల్‌సి కవిత పేరు రాలేదని, కేవలం తెలంగాణ పత్రిష్ఠను, కెసిఆర్‌ గౌరవాన్ని తగ్గించడానికి, కెసిఆర్‌ కుమార్తెపై నిందలు వేయడం సరికాదన్నారు. ఎంఎల్‌సి కవిత ఇంటిపై దాడిచేసినందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వెంటనే క్షమాపణ చెప్పాలని నరాల సుధాకర్‌ అన్నారు.

Check Also

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా జనరంజక పాలన

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »