చదువుతూనే ఉద్యోగం – గొప్ప అవకాశం

నిజామాబాద్‌, ఆగష్టు 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హెచ్‌.సి.ఎల్‌. టెక్‌ బీ ఎర్లీ కెరీర్‌ ప్రోగ్రాంలో చేరి, చదువుతూనే ఉపాధి అవకాశం పొందడం గొప్పవరం అని జిల్లా ఇంటర్‌ విద్యా అధికారి రఘురాజ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిరాజ్‌ డిగ్రీ కళాశాల ఆవరణలోని ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు హెచ్‌.సి.ఎల్‌. టెక్‌ సంస్థ ఆధ్వర్యంలో 2021-22 విద్యా సంవత్సరం ఇంటర్‌ ఎమ్‌.పి.సి., ఎమ్‌.ఈ.సి. పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగంతో పాటు ఉన్నత చదువులకు అవకాశం కల్పించే కార్యక్రమంలో జిల్లా ఇంటర్‌ విద్యా అధికారి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.

ప్రముఖ సాఫ్ట్వేర్‌, బిట్స్‌ పిలాని సంస్థ లలో విద్యా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎచ్‌.సి.ఎల్‌. కృషి అభినందనీయమని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు ఇది మంచి అవకాశం అన్నారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రామ్మోహన రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి అవకాశం విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

హెచ్‌.సి.ఎల్‌. సంస్థ చేస్తున్న కృషి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ధోహద పడుతోందని అన్నారు. హెచ్‌. సి. ఎల్‌. సంస్థ రాష్ట్ర ప్రతినిధి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి టెక్నాలజీని కెరీర్‌గా ఎంచుకుని, ఉపాధి కోరుకునే వారికి ఇది గొప్ప అవకాశమని అన్నారు. మేథ్స్‌ / బిజినెస్‌ మేథ్స్‌లో 2021-2022 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్‌ బోర్డు పరీక్ష ఉత్తీర్ణులై, 60 శాతం ఓవరాల్‌, 60 శాతం గణితంలో మార్కులు పొందిన వారు దీనికి అర్హులన్నారు.

సాప్ట్‌ వేర్‌ డెవలపర్‌, అనలిస్టు, డిజైన్‌ ఇంజనీర్‌, డేటా ఇంజనీర్‌, సపోర్ట్‌ అండ్‌ ప్రాసెస్‌ అసోసియేట్‌ తదితర ఉద్యోగాలు ఉంటాయని ఆయన తెలిపారు. టెక్‌ బీ ప్రోగ్రాంలో చేరిన విద్యార్థులకు శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత హెచ్‌ .సి.ఎల్‌. కంపెనీలో ఫుల్‌ టైం ఉద్యోగులుగా నియామకం ఉంటుందని ఆయన అన్నారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా క్లాస్‌ రూమ్‌ ట్రైనింగ్‌ మరియు ఇంటర్న్షిప్‌ ఉంటాయని, రూ. 10 వేలు స్టెయిఫండ్‌ ఇవ్వబడునని అన్నారు.

ప్రోగ్రాం పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాన్ని బట్టి ఏడాదికి రూ. 2.2 లక్షల వేతనంతో కెరీర్‌ ప్రారంభం అవుతుందన్నారు. అనంతరం అభ్యర్థులు బిట్స్‌ పిలాని, శస్త్ర మరియు అమిటి యూనివర్సిటీలు అందించే గ్రాడ్యుయేషన్‌ ప్రోగ్రాంను చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ టెక్‌ బీ ఒక సంవత్సరం శిక్షణ కు అయ్యే రూ. 1.18 లక్షల ఫీజును ఎడ్యుకేషనల్‌ లోన్‌ ద్వారా చెల్లించే వెసులుబాటు హెచ్‌.సి.ఎల్‌. కల్పిస్తుందన్నారు.

విద్యార్థులు అధిక సంఖ్యలో ప్రోగ్రామ్‌ లో జాయిన్‌ అవ్వడానికి సంబంధించిన సెలక్షన్‌ డ్రైవ్‌ పాల్గొన్నారు. సెలక్షన్‌ డ్రైవ్‌లో రిట్టెన్‌ ఎగ్జాం, ఇంటర్వ్యూ నిర్వహించారు. హెచ్‌.సి.ఎల్‌. సంస్థ ప్రతినిధి రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆత్మస్థైర్యంతో ఏదైనా సాధించవచ్చు…

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »