ఎడపల్లి, ఆగష్టు 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మద్యం సేవించి బైకు నడిపిన ఓ వ్యక్తిపై కేసు నమోదు కాగా, శుక్రవారం బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నెలరోజుల జైలుశిక్ష విధించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన గోవూరి హన్మాండ్లు అనే వ్యక్తి మార్చి 21న మంగళ్పాడ్ చౌరస్తా వద్ద మద్యం సేవించి బైకు నడుపుతుండగా పోలీసుల తనిఖీలో పట్టుబడ్డాడు.
ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు పంపారు. ఈ క్రమంలో శుక్రవారం బోధన్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కేసు పూర్వాపరాలు పరిశీలించి నిందితునికి నెలరోజుల జైలుశిక్ష విధించింది.