కామారెడ్డి, ఆగష్టు 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మొక్కలు నాటడం వల్ల అవి వృక్షాలుగా మారి భావితరాల మనుగడకు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.
కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం ఆయన మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు రెండు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ అన్యోన్య, అధికారులు పాల్గొన్నారు.